Naga Chaitanya: ఆ సినిమా హిట్ అయితే ఏపీ వరకు రీ సౌండ్ వినిపిస్తుంది.. అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-08-16 14:20:58.0  )
Naga Chaitanya: ఆ సినిమా హిట్ అయితే ఏపీ వరకు రీ సౌండ్ వినిపిస్తుంది.. అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న నేమ్. దానికి కారణం మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం. ప్రస్తుతం చైతు.. చందు ముండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా నాగ చైతన్య చెన్నైలో ఒక అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యాడు. ఈ అవార్డు వేడుకలో చైతు చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా నాగ చైతన్య వేదిక పైకి వెళ్ళగానే స్క్రీన్ పై వెంకట్ ప్రభు డైరెక్షనం‌లో దళపతి విజయ్ నటిస్తున్న ‘గోట్’ మూవీ పోస్టర్ ప్రదర్శించారు. దీనిపై స్పందించాలని నాగచైతన్యను యాంకర్ అడిగింది.

అప్పుడు నాగచైతన్య మాట్లాడుతూ.. “కస్టడీ చిత్రంలో నటిస్తున్నప్పుడు వెంకట్ ప్రభు నాకు గోట్ కథ చెప్పారు. విజయ్ ఫ్యాన్స్‌కి ఈ చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. అది గ్యారెంటీ. దళపతి విజయ్ సినిమా హిట్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడు నుంచి ఏపీ వరకు రీ సౌండ్ వినిపిస్తుంది” అంటూ నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చైతన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో నాగ చైతన్య ‘కస్టడీ’ అనే మూవీలో నటించగా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం మన అందరికీ తెలిసిందే.


Advertisement

Next Story