అడవుల్లో అలా చేస్తూ దొరికిపోయిన నాగచైతన్య-శోభిత.. ఫొటోలు, వీడియోలు వైరల్

by Disha Web Desk 7 |
అడవుల్లో అలా చేస్తూ దొరికిపోయిన నాగచైతన్య-శోభిత.. ఫొటోలు, వీడియోలు వైరల్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య, క్యూట్ బ్యూటీ శోభిత ధూళిపాళ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కూడా శోభితతో ఉన్న రిలేషనే అని నెట్టింట టాక్ కూడా వినిపించింది. అంతే కాకుండా గతంలో నాగచైతన్య, శోభిత లండన్‌కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో లంచ్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కావడతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు కన్ఫార్మ్ చేసుకున్నారు నెటిజన్లు.

కానీ, వీళ్లిద్దరూ మాత్రం మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో వీరిపై వస్తున్న రూమర్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇప్పుడు మరోసారి వీరి డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. తాజాగా నాగచైతన్య ఓ ఫొటో షేర్ చేశాడు. దీనికి శోభిత లైక్ కొట్టింది. అంతే కాంకుడా.. సేమ్ ఒకే లాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈమె ఫొటోలు కూడా శోభిత తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఇందులో సేమ్ చైతు ఫొటోలో బ్యాక్ గ్రౌండ్, అలాగే శోభిత షేర్ చేసిన ఫొటోలో, వీడియోస్‌లో సేమ్ బ్యాక్ గ్రౌండ్ కనిపించింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఇద్దరు కలిసి అడవిలోకి చెక్కేసినట్లు ఉన్నారని’.. ‘ఒకే దగ్గర తిరుగుతూ విడివిడిగా ఫొటోలు షేర్ చేస్తున్నారా’ అంటూ నెట్టింట రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఈ డేటింగ్ వార్తలపై చైతన్య, శోభిత ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా.. నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉండగా.. శోభిత ‘మంకీ మ్యాన్’ మూవీతో అలరిస్తుంది.



Next Story

Most Viewed