విడుదలకు ముందే ‘కల్కి 2898 ఏడి’ కథ లీక్ చేసిన నాగ్ అశ్విన్..! వీడియో వైరల్

by Hamsa |
విడుదలకు ముందే ‘కల్కి 2898 ఏడి’ కథ లీక్ చేసిన నాగ్ అశ్విన్..! వీడియో వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడి. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. పలువురు స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే కల్కి జూన్ 27న భారీ అంచనాల నడుమ థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ హైప్‌ను క్రియేట్ చేయడంతో పాటు రికార్డ్ సృష్టించాయి. ఈ క్రమంలో.. తాజాగా, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కథను రివీల్ చేశాడు. ‘‘ఈ కథ అన్నింటికీ క్లైమాక్స్. ఇది మన కలియుగంలో ఎలా జరగబోతోంది అనేది ఇందులో చూపించాము.

ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఈ కథకు కనెక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు ఇష్టం. నా ఫేవరెట్ మూవీ పాతాళభైరవి. దాని తర్వాత అన్ని సినిమాలు భైరవ ద్వీపం, ఆదిత్య 369 వంటివి కొన్ని హాలీవుడ్ మూవీస్ అలాంటి చూసినప్పుడు చాలా బాగున్నాయి అనిపించింది. కానీ ఇది మన స్టోరీస్ కావా.. అన్ని వెస్ట్ లోనే జరగాలా అలా అనిపించేది. పౌరాణికాల్లో రాసిన మన పురాణాలలో చివరి అవతారం కృష్ణ. మహాభారతం చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మన లాస్ట్ అవతారం కృష్ణ తో ముగుస్తుంది. సో అక్కడి నుంచి కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఇంకా ఎలా వెళ్తుంది అనేది ఇమాజినేషన్. కలియుగంలో ఎలా జరుగుతుంది కల్కి అనేవాడు ప్రతి కాలంలో ఉంటాడు.

ఒక్కో రూపంలో, కలియుగంలో ఎలాంటి రూపం తీసుకున్నాడు. హీరోతో పాటు చీకటి వెలుగులో క్లైమాక్స్ అనేది ఐడియా పెట్టుకుని రాసుకుంటే ఒక ఐదేళ్లు పట్టింది. జనాల్లో ఒకసారి ఈ వరల్డ్‌లో వెళ్లి ఈ కొత్త అటెంమ్ట్ సైఫై మైథలాజి మూవీని చూస్తే క్యూరియాసిటీ పెరుగుతుంది. జనాలు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇందులో మేకింగ్ సీన్స్‌ను కూడా యాడ్ చేశారు. అయితే ఈ వీడియోను ఎపిసోడ్-1గా వైజయంతి మూవీ మేకర్స్ యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం నాగ్ ఆశ్విన్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు 5 సంవత్సరాలు రాసుకున్నాడంటే.. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మూవీ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.


Next Story