Priyanka Chopra : ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న గ్లోబల్ స్టార్

by Satheesh |   ( Updated:2023-10-23 14:10:18.0  )
Priyanka Chopra : ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న గ్లోబల్ స్టార్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బిడ్డ పుట్టిన తర్వాత తన బిహేవియర్ పూర్తిగా మారిపోయిందంటోంది. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ విషయాలపై మాట్లాడింది. ‘అమ్మగా మారిన తర్వాత నా మనస్తత్వమే మారిపోయింది. చాలా మంది తల్లుల మాదిరిగానే మొదట్లో నాకూ ఎన్నో సందేహాలు వచ్చేవి. కానీ అమ్మగా మారిన తర్వాత నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. దేన్నైనా సాధించగలను అనే నమ్మకం కలిగింది. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ప్రోత్సహించారు. నాలో ఎంతో ధైర్యాన్ని నింపారు. ఇప్పుడు నేనూ నా కూతురికి అదే నేర్పించబోతున్నా. పాపను పెంచడంలో అది నాకు చాలా సహాయపడింది’ అంటూ వివరించింది ప్రియాంక.

Advertisement

Next Story

Most Viewed