ఇకపై నా జీవితం డైరెక్షన్‌కే అంకితం: శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు

by Javid Pasha |
ఇకపై నా జీవితం డైరెక్షన్‌కే అంకితం: శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు
X

దిశ, సినిమా: 'రెండు పడవల ప్రయాణం నాకు సరిపడదని అర్థమైంది. అందుకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగం వదిలేసి నాకు ఇష్టమైన సినిమా రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నా' అని తెలిపాడు శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు. 'చీమ-ప్రేమ-మధ్యలో భామ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్నాడు. 'మాగ్నం ఓపస్ ఫిల్మ్స్' పతాకంపై రూపొందిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రం పలు దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులు కూడా గెలుచుకుంది.

దీంతో సినిమాలపై మక్కువ పెంచుకున్న శ్రీకాంత్ త్వరలో తన ద్వితీయ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతూనే, మూడో సినిమా కోసం కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిపాడు. చివరగా తన అభిమాన దర్శకులైన రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ, జేమ్స్ కామెరూన్‌ను నిరంతరం ఫాలో అవుతానంటున్నాడు.



Advertisement

Next Story