నా కెరీర్ ప్రారంభమైంది అక్కడే.. Samantha పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-08-21 15:28:58.0  )
నా కెరీర్ ప్రారంభమైంది అక్కడే.. Samantha పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఖుషి’ సినిమా పూర్తి చేసుకున్న సమంత.. ప్రస్తుతం న్యూయార్క్ అందాలు ఎంజాయ్ చేస్తుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో సమంత పాల్గొని.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోస్, ఫొటోస్ అభిమానులతో పంచుకుంటుంది. ఇక లేటెస్ట్‌గా ఆమె పోస్ట్ చేసిన మరో ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మేరకు ‘‘కలలు కనేది న్యూయార్క్ అని వారు అంటున్నారు. నేను ఇక్కడ నా మొదటి సినిమా షూటింగ్ చేసినప్పుడు నా కెరీర్‌ని ప్రారంభించాను. తను ఎలా సాధించబోతుందనే దాని గురించి ఎటువంటి ఆధారం లేకుండా భయపడిన చిన్న అమ్మాయి.. కానీ పెద్ద కలని కనేంత ధైర్యం! 14 ఏళ్ల తర్వాత నేడు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : పెళ్లొద్దు కానీ ప్రెగ్నెంట్ అవుతానంటున్న అనుష్క శెట్టి.. సీసీటీవీ కెమెరాలున్నా డోంట్‌కేర్ అంటూ అతనితో..

Advertisement

Next Story