మహేష్ బాబుతో విబేధాలు.. షాకింగ్ ట్వీట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్

by Hamsa |   ( Updated:2023-06-20 03:24:44.0  )
మహేష్ బాబుతో  విబేధాలు.. షాకింగ్ ట్వీట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అయితే మహేష్ బాబుకు, తమన్‌ను విబేధాలు రావడంతో త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తొలగిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షాకింగ్ ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చాడు. ‘ నా స్టూడియో దగ్గర ఒక మజ్జిట స్టాల్‌ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే.. వారందరికీ స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్ నైట్’’ అంటూ రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Also Read: రెండో సినిమాపై కీలక అప్‌డేట్ ఇచ్చిన ‘బలగం’ డైరెక్టర్..

Advertisement

Next Story