7 Days 6 Nights: అతి తక్కువ టికెట్ రేట్లకే '7 డేస్ 6 నైట్స్' : మెగా మేకర్

by Javid Pasha |   ( Updated:2022-06-20 14:03:22.0  )
7 Days 6 Nights Movie will be Released On June 24
X

దిశ, సినిమా: 7 Days 6 Nights Movie will be Released On June 24| సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం '7 డేస్ 6 నైట్స్' ఎం.ఎస్. రాజు డైరెక్ట్ చేసిన చిత్రం ఈ నెల 24న విడులవనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఎస్ రాజు.. ఇది యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులంతా కలిసి చూడాల్సిన చిత్రమని అన్నారు. అందుకోసమే తెలుగు రాష్ట్రాల్లో ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకే అమ్మాలని డిస్ట్రిబ్యూటర్లకు సూచించినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించిన దర్శకుడు.. ఫస్ట్ కాపీ చూసి హ్యాపీగా ఫీలైనట్లు చెప్పాడు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన రజనీకాంత్, మెహర్ చాహల్, కృతికా శెట్టి, లిరిక్ రైటర్ కృష్ణకాంత్, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed