గ్రాఫ్ పడిపోయిందంటూ ట్రోల్స్.. బిగ్ ప్రాజెక్ట్ ఓకే చేసిన యంగ్ బ్యూటీ!

by sudharani |   ( Updated:2024-05-22 03:03:31.0  )
గ్రాఫ్ పడిపోయిందంటూ ట్రోల్స్.. బిగ్ ప్రాజెక్ట్ ఓకే చేసిన యంగ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీతామహాలక్షీగా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ మొన్నటి వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి చిత్రంతోనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. మ‌ృణాల్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో ఆఫర్స్ అమ్మడు చుట్టుముట్టాయి. అయితే.. ఈ ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో.. ఈమె గ్రాఫ్ పడిపోయినట్లు నెట్టింట వార్తలు వినిపించాయి.

అంతే కాకుండా ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా అనౌన్స్ చెయ్యకపోవడంతో.. ఆఫర్లు కూడా తగ్గుముఖం పట్టినట్లు టాక్. ఇలాంటి సమయంలో మృణాల్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తుంది. పాపులర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘మామ్’ ఫేమ్ దర్శకుడు వరి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. డిఫరెంట్ రొమాంటిక్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా.. హీరోయిన్‌గా మృణాల్‌ను ఓకే చేసినట్లు సమాచారం. సంగీతం ప్రాధాన్యంగా రాబోతున్న ఈ మూవీ జూన్ నుంచి చిత్రీకరణ స్టార్ట్ చెయ్యనున్నారట. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story