పర్సనల్ పార్ట్స్‌ను అక్కడ జూమ్‌ చేసి మరీ చూస్తున్నారు.. మృణాల్ ఎమోషనల్ కామెంట్స్.. పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2024-03-20 14:21:48.0  )
పర్సనల్ పార్ట్స్‌ను అక్కడ జూమ్‌ చేసి మరీ చూస్తున్నారు.. మృణాల్ ఎమోషనల్ కామెంట్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకుల్. ఈ బ్యూటీ అందం, అభినయంలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ దక్కించుకున్న మృణాలు తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. సోషల్ మీడియాలోని పోస్ట్ లపై స్పందించింది.

‘‘హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్లను వస్తువులా చూస్తున్నారు. అంతేకాదు వారు హీరోయిన్ల పర్సనల్ పార్ట్స్ పై ఫోకస్‌ చేసి, వాటిని జూమ్‌ చేసి మరీ దారుణంగా కామెంట్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క ఫొటోను రకరకాలుగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఈ విషయం చాలా బాధ కలిగిస్తుంది’’. అంటూ హీరోయిన్ మృణాల్ ఠాకుల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సీతారామం బ్యూటీ చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

Next Story