ఈ రోజుల్లో వాటికి సరిహద్దులు లేవు.. అందరితో అల్లుకుపోవాలి

by sudharani |   ( Updated:2023-06-01 09:39:34.0  )
ఈ రోజుల్లో వాటికి సరిహద్దులు లేవు.. అందరితో అల్లుకుపోవాలి
X

దిశ, సినిమా: నేటి కాలంలో సినిమాలు, భాషలకు సరిహద్దులు లేవంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలి ఆమె నటించిన తమిళ-తెలుగు ద్విభాషా హారర్ కామెడీ ‘బూ’ తాజాగా హిందీలో జియో సినిమాలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. కాగా దీనిపై మాట్లాడిన నటి.. ఈ ఏడాది గొప్ప దర్శకులతో చిత్రాలు చేసినందుకు 2023 బ్రైట్‌గా కనిపిస్తోందని తెలిపింది. అలాగే భిన్నమైన కథ, కథనాల్లోనే తనకు అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పిన నటి.. మల్టీ లాంగ్వేజ్ స్టార్స్‌‌తో కలిసి పనిచేసినప్పుడు గొప్ప అనుభూతి కలుగుతోందని చెప్పింది. ‘ప్రజలకు మంచి చిత్రాలను, విభిన్న అంశాలను అందించడాన్ని నేను గొప్పగా భావిస్తా. ఇన్నాళ్లు పాశ్చాత్య సినిమాలు చూస్తూ ఇప్పుడు కొరియన్, ఫ్రెంచ్ సినిమాలు చూస్తున్నాం. అందుకే సినిమా, భాషలకు హద్దులు లేవు. మన చిత్రాన్ని ఎక్కువ మంది చూస్తేనే చాలా బాగుంటుంది’ అని ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Read More: నేను బై-సెక్సువల్.. అన్ని అందాలను ఆస్వాదిస్తా: మిస్ యూనివర్స్

Advertisement

Next Story