కుక్కలతో కూడా తల్లి కావచ్చు.. నటి కామెంట్స్‌పై నెటిజన్స్ రియాక్షన్

by Sujitha Rachapalli |
కుక్కలతో కూడా తల్లి కావచ్చు.. నటి కామెంట్స్‌పై నెటిజన్స్ రియాక్షన్
X

దిశ, సినిమా :కన్నడ నటి హితా చంద్రశేఖర్ తోటి నటుడు కిరణ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కానీ తల్లిదండ్రులుగా మారబోయేది ఎప్పుడు అనే ప్రశ్నకు లేటెస్ట్ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది. 'ఇంకెన్నాళ్లకు మాతృత్వాన్ని ఆస్వాదిస్తావని అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా బంధువులు ఈ ప్రశ్నతో విసిగిస్తున్నారు. కానీ ఆ అనుభూతిని పొందేందుకు పిల్లలనే కనక్కర్లేదు. రెండు కుక్కలను పెంచుకున్నా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను, కిరణ్‌కు ముందే చెప్పా. బిడ్డలను కనడం నా వల్ల కాదని. ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు' అని సమాధానం ఇచ్చింది.

ఇక ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకోవడం చాలా కంఫర్ట్ అండ్ హ్యాపీ గా ఉందని తెలిపింది హిత. తన సపోర్ట్ వల్లే మరిన్ని ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నాని.. ఇండస్ట్రీలో ఎదగగలుగుతున్నానని తెలిపింది. కాగా ఆమె నటించిన బాలీవుడ్ ప్రాజెక్ట్ 'Do Aur Do Pyar' ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతుండగా.. ఇందులో తను ప్లే చేసిన లత క్యారెక్టర్‌కు గ్రేట్ అప్రిసియేషన్ అందుతుందని నమ్ముతుంది హిత.

Advertisement

Next Story

Most Viewed