Ananya Pandey: ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటా.. లైగర్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-09-03 14:47:59.0  )
Ananya Pandey: ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటా.. లైగర్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయన్ మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ మూవీలో చేసింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అనన్య బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ అడపా దడపా చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె నటించి తాజా మూవీ ‘కాల్ మీ బే’ ఇది డైరెక్ట్‌గా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.

ఇదిలా ఉంటే.. అనన్య సినిమాలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, ఈ అమ్మడు తన పెట్‌ను తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘2008లో ఫడ్జ్‌ నిన్ను నేను కోల్పోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఐ లవ్ యు ఫైటర్. 16 సంవత్సరాల జీవితం నీ వల్లే ఆనందంతో నిండి ఉంది. నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటా’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ అనన్య పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు రెడ్ హార్ట్ సింబల్ షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed