- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య ఇప్పుడు బాబు కాదు తాత: Veera Simha Reddy మూవీపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సైటెర్లు వేశారు. బాలయ్య బాబు కాదని.. ఇప్పుడు బాలయ్య తాత అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. ఆయనను చూడటానికి ఇప్పుడు ఎవరు వస్తారని ఎగతాళి చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుకున్నంత జనం రాలేదన్నారు. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదని.. ఇప్పుడు ఆయన వీర సింహారెడ్డి అని అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య రోడ్లపై మీటింగ్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాయగూరలు, పల్లీలు కొనడానికి వచ్చిన వారితో మీటింగ్‌లు పెట్టి జనాలను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతి కోసం చిత్రబృందం అప్లయ్ చేస్తే.. దానిని పరిశీలించి అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక, బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ట్రైలర్‌లో ''సంతకాలు పెడితే బోర్డు పేరు మారుతుంది.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు'' అని బాలయ్య ఇన్ డైరెక్ట్‌గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటి పేరు మార్పుపై ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.