కెమెరా ముందే నటిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న సింగర్..

by Anjali |   ( Updated:2023-04-10 14:45:44.0  )
కెమెరా ముందే నటిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న సింగర్..
X

దిశ, సినిమా: సింగర్ మికా సింగ్ తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని గతంలో కేసు పెట్టింది నటి రాఖీ సావంత్. అయితే 17 ఏళ్ల నాటి ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మికా సింగ్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నందున కేసును రద్దు చేయాలని కోరాడు. అయితే ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు అఫిడవిట్‌ను హైకోర్టు రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో మిస్‌ప్లేస్ చేశారని, అందుకే ట్రేస్ చేయడం లేదని సావంత్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే వారంలోగా తాజా అఫిడవిట్‌ను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా 2006లో తన పుట్టినరోజు వేడుకల్లో కెమెరాల ముందు రాఖీ సావంత్ అనుమతి లేకుండా మీకా సింగ్ ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేయబడిన సింగ్.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

Also Read..

బుల్లితెర నటి కేసు.. కోర్టులో హాజరైన సింగర్..

Advertisement

Next Story

Most Viewed