రెండేళ్లుగా పిల్లలను కనేందుకు ట్రై చేస్తున్నా.. ఇప్పుడు సక్సెస్ అయింది.. పెళ్లికాని హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్ వైరల్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-30 05:29:17.0  )
రెండేళ్లుగా పిల్లలను కనేందుకు ట్రై చేస్తున్నా.. ఇప్పుడు సక్సెస్ అయింది.. పెళ్లికాని హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్ వైరల్..
X

దిశ, సినిమా : యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కెరీర్ బిగినింగ్‌లో దూసుకుపోయింది. ఆమె చేసిన పాత్రల పేర్లు కూడా గుర్తుండిపోయేలా నటించింది ఈ బ్యూటీ. అయితే ఈ టైమ్‌లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. తర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్థం బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం పూర్తిగా చిక్కిపోయి కనబడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కాస్త బెటర్‌గా కనిపిస్తున్న మెహ్రీన్.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది.

కెరీర్ మీద దృష్టిపెట్టేందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న అమ్మడు.. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అందం కంపల్సరీ అనే విషయాన్ని తొందరగానే తెలుసుకుంది. అయితే పిల్లలను కనాలని ఉన్న తను కెరీర్ బాగున్నప్పుడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి తన ఎగ్స్ ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రాసెస్‌‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దాదాపు రెండేళ్లుగా ఇందుకోసం ప్రయత్నిస్తున్నానని, ఇప్పడు సక్సెస్ అయిందని చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియోపై నెట్టింట పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ క్లిపింగ్ జాబ్ చేసే అమ్మాయిలకు హెల్ప్ అయ్యే చాన్స్ ఉందని.. వారు కూడా ఈ ప్రాసెస్ ఫాలో కావచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story