నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మెగాస్టార్ ఒకరు : Shiva Rajkumar

by sudharani |   ( Updated:2023-10-03 15:51:48.0  )
నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మెగాస్టార్ ఒకరు : Shiva Rajkumar
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన.. ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయిన ఆయన.. తెలుగు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు, తారక్, చెర్రీలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన.. మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘చిరు లెజెండ్.. ఎప్పటికీ లెజెండ్‌గానే ఉంటారు. ఆయనను కలిసిన ప్రతిసారి ఎంతో నేర్చుకున్నాను. నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన నా పట్ల కనబరిచిన ప్రేమ, గౌరవం ఎన్నటికీ మర్చిపోలేను. ఆయనపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది’ అంటూ శివ రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

Read More: ‘కాంతార’ హీరోయిన్ సప్తమీ గౌడలో ఇంత విషయం ఉందా..?

Advertisement

Next Story