Chiranjeevi Konidela: నేషనల్ అవార్డు విజేతలకు మెగాస్టార్ హార్ట్లీ విషెష్.. పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2024-08-17 06:12:22.0  )
Chiranjeevi Konidela: నేషనల్ అవార్డు విజేతలకు మెగాస్టార్ హార్ట్లీ విషెష్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: 70వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలందరికీ టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మెగాస్టార్ ట్విట్టర్ వేదికన రాసుకొస్తూ.. ‘‘ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నటి నిత్య మేనన్(తిరుచిత్రంబలం), హీరోయిన్ మాన్సీపరేఖ్, 70 జాతీయ ఉత్తమ చిత్రం ఆట్టం, నటుడు నిఖిల్ నటించిన ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం, ఉత్తమ తమిళ ప్రాంతీయ చిత్రంగా పొన్నియన్ సెల్వన్1, మోస్ట్ ఆల్ విజన్ ఉన్న డైరెక్టర్ మణిరత్నంకు భారతదేశం అంతటా అండ్ పరిశ్రమల నుంచి ప్రతి అవార్డు విజేతకు నా హృదయపూర్వక అభినందనలు’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి పోస్ట్‌లో రాసుకొచ్చారు.

చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Click Here for Twitter Link : https://x.com/KChiruTweets/status/1824467756927852726

Advertisement

Next Story