- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్ పెళ్లిలో 20 ఏళ్ల కుర్రాడిలా మెగాస్టార్.. ఎల్లో డ్రెస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా లుక్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య హాల్దీ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో లావణ్య, వరుణ్ పసుపు బట్టల్లో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్.. తన కాబోయే భార్యను రొమాంటిక్‌గా హగ్ చేసుకున్న స్టిల్స్ మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అలాగే నాగబాబు కూడా తన భార్యతో కలిసి అదిరిపోయే ఫోజులు ఇచ్చాడు. హల్దీ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్‌గా 20 ఏళ్ల కుర్రాడిలా ఎల్లో డ్రెస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
స్వాగ్‌తో కూర్చుని ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో పంచుకోగా మెగా ఫ్యాన్స్ చిరుపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక రేపు (నవంబర్ 1) మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్, లావణ్య గ్రాండ్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి రిసెప్షన్ జరుగనుంది. ఈ రిసెప్షన్ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇదిలా ఉండగా వరుణ్ పెళ్లి కోసం అతిథులంతా సపరేట్ డ్రెస్ కోడ్‌లో రావాలని రిక్వస్ట్ చేసినట్లు సమాచారం. ఎల్లో, వైట్ లేదా పింక్ డ్రెస్సుల్లో పెళ్ళికి హాజరు కావాలని కోరారట. ఈ వివాహానికీ మొత్తం 120 మంది హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.