మెగాస్టార్ అండ్ అల్లు ఫ్యామిలీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటోన్న అర్హ క్యూట్ పిక్స్

by Anjali |
మెగాస్టార్ అండ్ అల్లు ఫ్యామిలీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటోన్న అర్హ క్యూట్ పిక్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈయన నటన, డాన్స్‌తో కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 70 ఏళ్లు దగ్గరగా వస్తోన్న అదే ఎనర్జీతో డాన్స్ ఇరగదీస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో వశిష్ఠ దర్శకత్వంలో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. కాగా వచ్చే సంవత్సరం జనవరి 10 వ తారీకున మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఇదిలా ఉండగా..

అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ మధ్యనున్న అనుబంధం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఇటీవల వీరి కుటుంబాల నడుమ పలు వివాదాలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. వీటికి చెక్ పెట్టేలా నెట్టింట పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవికి బ్లడ్ బ్యాంక్ ఉన్న విషయం తెలిసిందే. కాగా చిరు ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అక్కడ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ అండ్ క్యూట్ పాప అర్హ, అయాన్ హాజరయ్యారు. వీరంతా మెగాస్టార్ పక్కనే ఉండి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వైట్ అవుట్ ఫిట్ లో అర్హ వెరీ క్యూట్, రెండు ఫ్యామిలీలు ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

Advertisement

Next Story

Most Viewed