- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MEGASTAR: ఆగస్టు 22 న మెగాస్టార్ బర్త్ డే.. చిరు ఏన్నేళ్లలోకి అడుగుపెట్టనున్నారో తెలిస్తే షాక్
దిశ, సినిమా: కోట్లాదిమంది ఆదర్శంగా తీసుకునే టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్వకత్వం వహిస్తోన్న ఈ ఫాంటసీ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఆల్మోస్ట్ ఈ చిత్ర షూటింగ్ ఎండింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10 న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఏడాది ఆగస్టు 22 వ తారీకున పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఈయనే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా చిరు పుట్టిన రోజున తెగ సందడి చేస్తారు. ఫ్లెక్సీలు కట్టించి.. కేక్ కట్టింగ్స్ చేస్తారు. సోషల్ మీడియాలో విషెష్ తెలియజేస్తూ.. ఫొటోలతో, వీడియోలతో తెగ హంగామా సృష్టిస్తారు. బర్త్ డే న ఆయన గొప్పతనాన్ని, చిరు నటించిన సినిమాల్ని అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటారు.
అయితే చిరంజీవి ఈ పుట్టిన రోజున 69 సంవత్సరాల్లోకి అడుగుపెట్టనున్నారు. కానీ చిరు మాత్రం కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ యూత్ లా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాగా మెగాస్టార్ వయస్సు 70 ఏళ్లకు దగ్గరగా ఉందంటే.. ఆయన ఎనర్జీకి, మెయింటైన్ చేసే బాడీని చూసి ఎవరూ నమ్మట్లేదు. 69 ఏళ్లా..? అంటూ నెటిజన్లు నోరెళ్లబెట్టుకుంటున్నారు.