వరుణ్ తేజ్ '#12' నుంచి ఫస్ట్ లుక్!

by Hajipasha |   ( Updated:2023-01-21 14:47:30.0  )
వరుణ్ తేజ్ #12 నుంచి ఫస్ట్ లుక్!
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకూ మంచి లవ్ స్టోరీస్‌తో అకట్టుకున్నా వరుణ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారుతో కలిసి తన 12వ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోయే డేట్ అనౌన్స్ చేశారు. జనవరి 19న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేయనున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనుంది. ఇందులో దేశం కోసం పోరాడే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ కనిపించనున్నాడు.

Advertisement

Next Story