Sai Durga Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. చిన్నారుల కోసం భారీ విరాళం.. నెట్టింట ప్రశంసలు

by Hamsa |
Sai Durga Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. చిన్నారుల కోసం భారీ విరాళం.. నెట్టింట ప్రశంసలు
X

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటున్నారు. ఇటీవల సాయి దుర్గ తేజ్ వరద బాధితులకు రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 20 లక్షలు ఇవ్వడంతో పాటు అమ్మ అనాధాశ్రమానికి రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. నిత్యం ఆయన ఎంతో మంది అనాధలను ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, మరోసారి సాయి దుర్గ తేజ్ గొప్ప మనసు చాటుకున్నారు.

నేడు (సెప్టెంబర్ 29) వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో ఈ మెగా హీరో తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు. అంతేకాకుండా అక్కడి పిల్లలతో మాట్లాడి వారితో ఫొటోలు కూడా దిగారు. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌కు రూ. 5 లక్షల విరాళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రజెంట్ ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed