Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటి ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

by sudharani |   ( Updated:2024-07-29 02:10:34.0  )
Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటి ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
X

దిశ, సినిమా: నువ్వేకావాలి, మ‌న్మథుడు, మ‌ల్లీశ్వరి వంటి అద్భుతమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను అందించిన ద‌ర్శకుడు కె. విజ‌య్‌భాస్కర్ ద‌ర్శక‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ చిత్రం రాబోతుంది. ‘ఉషా ప‌రిణ‌యం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ధరమ్ తేజ్.. సోషల్ మీడియాలో వస్తున్న తన పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ మేరకు ‘మీ లవ్ గురించి చెప్పండి’ అని యాంకర్ తేజ్‌ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. ‘నాకు వన్‌సైడ్ లవ్ ఉంది. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి మాట్లాడేలోపు.. అదేంటీ మీకు పెళ్లి అయిపోయిందంట కదా? అని నన్ను ప్రశ్నిస్తు్న్నారు. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి చూశామంటూ సమాధానం ఇస్తున్నారు’ అంటూ నవ్వుకుంటూ ఆన్సర్ ఇచ్చాడు మెగా హీరో. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో తన పెళ్లి వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చిందంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story