- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పవన్ అనే నేను.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముస్తాబైన మెగా ఫ్యామిలీ.. అకీరా, ఆద్యతో ఎంత సందడో!
దిశ, సినిమా : ఎన్నో రోజుల కల నెరవేరనుంది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలా అని అటు కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. ప్రస్తుతం ఆ రోజు రానే వచ్చింది. మైక్ ముందు పవన్ అనే నేను.. అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి తన సత్తా చాటారు. దీంతో ఏపీలో నేడు ( బుధవారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఆయనతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ వేడుకకు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరు అవుతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ కూడా ఈ వేడుకను కళ్ళార చూడనికీ ముస్తాబు అవుతుంది. అకీరా, ఆద్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సుల్లో ఈ వేడుకకు బయలు దేరారు.
ఇన్ని రోజుల్లో మూవీ ఈవెంట్స్, జనసేన ఈవెంట్స్ పై పవన్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి సారిగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తన స్పీచ్ వినిపించబోతున్నారు. దీంతో ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల కళ్లు కూడా ఆయన మీదే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడాలని అకీరా, ఆద్య, సాయిధరమ్ తేజ్, నిహారిక, చిరు,నాగబాబు ఫ్యామిలీ మొత్తం బయల్దేరింది. ప్రస్తుతం వారు బస్సులో కూర్చుని తమ సంతోషం వ్యక్తం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అందరి కళ్లు అకీరా, ఆద్య పైనే ఉన్నాయి. పవన్ గెలిచినప్పటి నుంచి అకీరా పవన్ తోనే ఉన్న విషయం తెలిసిందే.