Niharika: విడాకులపై మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్.. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందంటూ

by Kavitha |   ( Updated:2024-07-31 09:49:04.0  )
Niharika: విడాకులపై మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్.. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందంటూ
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం నటిగా కాకుండా యాంకర్‌గా, నిర్మాతగా కూడా బాగా పాపులర్ అయింది. అయితే నిహారిక గతంలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలా విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని నెలలు సైలెంట్‌గా ఉన్న నిహారిక ఇప్పుడు మళ్లీ వర్క్ మీద ఫోకస్ పెట్టి దూసుకుపోతుంది. అయితే గతంలో పలు ఇంటర్వ్యూలలో తన డైవర్స్ గురించి కామెంట్స్ చేసిన నిహారిక. మరోసారి తన డివోర్స్ పై ఇన్‌డైరెక్ట్‌గా షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం నిహారిక నిర్మాతగా నిర్మించిన ఫస్ట్ మూవీ ‘కమిటీ కుర్రాళ్లు’. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అక్కడ ఆమె ఇండైరెక్ట్‌గా తన డివోర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా మీ పర్సనల్ విషయాల నుంచి మూవ్ ఆన్ అయిపోయారా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అని అడగ్గా.. వాటికి నిహారిక సమాధానమిస్తూ.. “ఆ టైం వెళ్ళిపోయింది. ప్రస్తుతం నేను నా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం యాక్టింగ్, సినిమాలు నిర్మించడం పైనే దృష్టి పెడుతున్నాను. నేను జస్ట్ హ్యాపీగా ఉండాలి అంతే. అది సింగిలా లేదా కమిటెడ్ అనేది సమయం నిర్ణయిస్తుంది. నేను ఏది కావాలని వెతుక్కొని వెళ్ళను. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నా పేరెంట్స్ కూడా ఈ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళు నన్ను ఆ విషయంలో ప్రెజర్ చేయరు” అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story
null