వాటికి ఆకు అడ్డం పెట్టి మెగా డాటర్ చిలిపి ఫోజులు.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు

by sudharani |   ( Updated:2024-03-23 14:17:06.0  )
వాటికి ఆకు అడ్డం పెట్టి మెగా డాటర్ చిలిపి ఫోజులు.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత పలు మూవీల్లో నటించి మెప్పించినప్పటికీ హీరోయిన్‌గా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే.. చైతన్యతో పెళ్లి, విడాకుల అనంతరం కెరీర్‌లో స్పీడ్ పెంచింది ఈ అమ్మడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. వెబ్ సిరీస్‌ల్లో కూడా మెరుస్తోంది. ఇక ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారి పలు సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట కాకరేపుతున్నాయి. బ్లాక్ డ్రెస్ ధరించి ఎద అందాలకు అడ్డుగా ఆకు పెట్టి చిలిపిగా ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ ఫొటోలు ఇప్పటివి కాదు. గతంలో గోవాలో ఎంజాయ్ చేసినప్పటి ఫొటోలు అని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా తెలుపుతూ.. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ గోవా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Read More : బికినీ ధరించి థాయిలాండ్ దీవుల్లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న మీనాక్షి చౌదరి

Advertisement

Next Story