రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఆ పిక్స్ వైరల్!

by Harish |   ( Updated:2023-02-02 09:30:31.0  )
రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఆ పిక్స్ వైరల్!
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ మీరా జాస్మిన్‌ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు పదేళ్లపాటు తెలుగు సినిమాలకు దూరమైన ఆమె.. మళయాలంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అంతేకాదు ఓ వైపు సినిమాలతో బిజీ ఉంటూనే సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తను నటించిన ఓ తెలుగు సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అలాగే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నట్లు వివరించిన బ్యూటీ.. తన రోల్‌ డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో అభిమానులతో పంచుకుంది. కానీ, ఈ మూవీ వివరాలను మాత్రం గోప్యంగా ఉంచడం విశేషం. కాగా మీరా ఏ మూవీలో నటించింది? హీరో, దర్శకుడు ఎవరు? అనే క్యూరియాసిటీ నెటిజన్లలో పెరిగిపోగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.

Read more: 'నేను కాదు నువ్వే'.. సమంత- చిన్మయిల మధ్య ఆసక్తికర సంభాషణ!

Advertisement

Next Story