- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు విష్ణు నిర్ణయంపై మీనా రియాక్షన్.. అలాంటి కామెంట్స్ వల్ల ఎందరో ఇబ్బంది పడ్డారంటూ పోస్ట్
దిశ, సినిమా: ఇటీవల మంచు విష్ణు అసభ్యకరమైన కామెంట్స్, థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్‌పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏకంగా 18 చానల్స్‌ను బ్యాన్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ క్రమంలో.. మంచు విష్ణు నిర్ణయంపై చాలామంది సినీ సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా మంచు విష్ణు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ షేర్ చేసింది.
‘‘అనేక యూట్యూబ్ ఛానెల్స్‌లో అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నందుకు వాటిపై వెంటనే చర్యలు తీసుకోవడం అద్భుతం. మంచు విష్ణు నేతృత్వంలో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కి చాలా ధన్యవాదాలు. మా పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీ అంకితభావం నిజంగా అభినందనీయం. పరువుకు భంగం కలిగించే కామెంట్స్ వల్ల ఎందరో ఇబ్బంది పడ్డారు. నెగిటివ్ కామెంట్స్‌ను ఎదిరించడంలో మన సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలి.
మా సంఘాన్ని రక్షించడంలో మీ నిరంతర మద్దతు కోసం మేము ఎదురు చూస్తున్నాము. కలిసి, మేము అందరికీ సానుకూల గౌరవప్రదమైన స్థలాన్ని అందించగలము. మంచు విష్ణు చాలా మంచి చేశారు’’ అని రాసుకొచ్చింది. అలాగే న్యూస్ క్లిప్స్‌ను కూడా షేర్ చేసింది. ఇక అది చూసిన వారు యాక్షన్ తీసుకోండి మేము మీ వెంట ఉంటాము అని సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
(Video Link Credits to meenasagar16 Instagram Channel)