భర్త చనిపోయిన తర్వాత.. మొదటి‌సారి తాను ప్రేమించిన హీరో పేరు రివీల్ చేసిన మీనా!

by samatah |
భర్త చనిపోయిన తర్వాత.. మొదటి‌సారి తాను ప్రేమించిన హీరో పేరు రివీల్ చేసిన మీనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : నాటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించ ఈ ముద్దుగుమ్మ, ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి, పెళ్లి చేసుకొని, భర్త, పాపతో సంతోషంగా గడుపుతున్న సమయంలో, ఆమె జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది. మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణంతో ఆమె ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ, షూటింగ్‌లలో బిజీ అయిపోయింది. అయితే తాజాగా నటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమిళ ఛానెల్‌లో నటి సుహాసిని హోస్ట్ చేస్తున్న చాట్ షోలో మీనా గెస్ట్ గా పాల్గొంది. ఈ చాట్ షోలో ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు.

తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన హీరో ఎవరో చెప్పేసింది. అయితే ఆ హీరో ఎవరనుకుంటున్నారా.. బాలీవుడ్ సూర్ స్టార్ హృతిక్ రోషన్. చిన్న ప్పుడు ఆయనంటే చాలా ఇష్టమని, హృతిక్ లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, ఆయనకు పెళ్లి కావడంతో చాలా బాధపడ్డానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా చేసి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story