Mathu Vadalara -2: ‘మత్తు వదలరా- 2’ ఫస్ట్ డేనే కళ్లు చెదిరే కలెక్షన్స్.. ఎంతంటే?

by Anjali |   ( Updated:2024-09-15 04:25:49.0  )
Mathu Vadalara -2: ‘మత్తు వదలరా- 2’  ఫస్ట్ డేనే కళ్లు చెదిరే కలెక్షన్స్.. ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ నిన్న (సెప్టెంబరు13) థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. 2019 లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు కొనసాగింపుగా మత్తు వదలరా-2 రూపొందించారు. రీతేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, రోహిణి, వెన్నెల కిశోర్, సత్య, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం మత్తు వదలరా-2 థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. సస్పెన్స్ క్రైం కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ చిన్నదైనా మంచి సక్సెస్ అందుకుంటోంది. ఇకపోతే ఈ ఫిల్మ్ ఫస్ట్ డే కలెక్షన్లు జనాల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటి రోజే ఏకంగా రూ. 5. 3 కోట్లు వసూళ్లు కొల్లగొట్టడం రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ సంతోషాన్ని మత్తు వదలరా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

చిన్న సినిమాగా తెరకెక్కిన బలగం వంటి సినిమాలు పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు చిన్న సినిమానైనా ఎగబడి మరీ చూస్తారని మత్తు వదలరా -2 మూవీ మరోసారి నిరూపించింది.


Read More....

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ఈ తేదీ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం.. ఎ...

Advertisement

Next Story

Most Viewed