- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mohan Babu: ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా.. మోహన్ బాబు క్యారెక్టర్‌పై మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా : టాలీవుడ్ నటుడు, తండ్రి మోహన్ బాబు వ్యక్తిత్వం గురించి మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. నిజానికి తాను మోహన్ బాబును ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినప్పటికీ తనను ప్రేమగానే చూసుకున్నారని, కష్టసమయాల్లోనూ అండగా నిలిచారని చెప్పాడు. ‘మా నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన కష్టాలను అధిగమించిన తీరునుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన గెలుపోటములకు అతీతంగా ముందుకు సాగడానికి ప్రేమే కారణం. చేసే ప్రతి పనిని చాలా ప్రేమిస్తారు. నా లైఫ్ ఒడిదొడుకుల్లో ఉన్నపుడు బాసటగా నిలిచి.. మళ్లీ నా జీవితంలో కొత్త వెలుగులు నింపారు. మౌనికను చేసుకుంటానని నాన్నతో ముందే చెప్పాను. నా ఇష్టాన్ని గౌరవించి మా పెళ్లి చేసినందుకు ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నా సహచరి మౌనికకు అన్ని విషయాల్లో మద్ధతుగా నిలుస్తా’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి: