Adipurush :2500 మంది అనాథ పిల్లలకు ‘ఆదిపురుష్’ చూపించనున్న మంచు మనోజ్ దంపతులు

by sudharani |   ( Updated:2023-06-13 12:03:15.0  )
Adipurush  :2500 మంది అనాథ పిల్లలకు ‘ఆదిపురుష్’ చూపించనున్న మంచు మనోజ్ దంపతులు
X

దిశ, సినిమా: ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కానుంది. అయితే ఈ పౌరాణిక చిత్రాన్ని అనాథ పిల్లలు, వృద్ధులకు చూపించేందుకు రణ్‌బీర్ కపూర్, రామ్ చరణ్ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా మంచు మనోజ్, అతని భార్య మౌనిక కూడా రంగంలోకి దిగారు. మొత్తం 2500 మంది అనాథ పిల్లలకు ‘ఆదిపురుష్’ చూపించడానికి సిద్ధం అయ్యారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ‘ఇది మా జీవితంలో దొరికిన గొప్ప అవకాశం. ఈ జూన్ 16న ‘ఆదిపురుష్’ వంటి పౌరాణిక కళాఖండాన్ని చూపించేందుకు తెలుగు రాష్ట్రాల్లో వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది చిన్నారులకు ఈ మూవీ చూపించాలని నిర్ణయించుకున్నాం. పవిత్ర మంత్రం ‘జై శ్రీరామ్’ ప్రతిచోటా ప్రతిధ్వనించనివ్వండి’ అంటూ ట్వీట్ లో పెర్కోన్నారు.

Advertisement

Next Story