భూమ మౌనికతో రిలేషన్‌పై మంచు మనోజ్ క్లారిటీ ?

by samatah |   ( Updated:2023-01-09 13:26:21.0  )
భూమ మౌనికతో రిలేషన్‌పై మంచు మనోజ్ క్లారిటీ ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరో మంచు మనోజ్, చిన్న నాటి స్నేహితురాలు భూమ మౌనికతో ప్రేమలో ఉన్నారని, గత కొన్ని రోజుల నుంచి వీరు సహజీవనం చేస్తున్నట్లు చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా చాలా సార్లు కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో గాసిప్స్ ఎక్కువయ్యాయి. అయితే ఈ వార్తలపై అటు భూమ మౌనిక కానీ, మనోజ్ కానీ స్పందించలేదు. కాగా తాజాగా మనోజ్ చేసి ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

భూమ మౌనిక తండ్రి, మా అంకుల్ దిగవంత భూమ నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఈయన గొప్పనాయకుడే కాదు, గొప్ప భర్త, గొప్ప కొడుకు, గొప్ప తండ్రి. అన్నింటికంటే మంచి మనసు కలిగిన గొప్ప వ్యక్తి, మా మేనమామ భూమా నాగిరెడ్డి. ఈరోజు ఈయన జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నామని పోస్టు చేశాడు. అంతే కాకుండా మీ అందరి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలి' అని అభిమానులను కోరాడు.

దీంతో ఇప్పుడు మరో వార్త సంచలనంగా మారింది. భూమ మౌనికను మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే ఆయన ఇలా ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ గాసిప్ తెగ వైరల్ అవుతోంది. వారిద్దరిపై ఎన్ని వార్తలు వచ్చినా మనోజ్, మౌనిక స్పందించలేదు. ఇక పుకార్లకు చెక్ పెట్టడానికే మనోజ్ ఇన్ డైరెక్ట్‌గా ఈ ట్వీట్ చేశారంటూ నెట్టింట్లో గుస గుస పెడుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Next Story