30 పాఠశాలలు దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ!

by sudharani |   ( Updated:2023-06-29 13:45:14.0  )
30 పాఠశాలలు దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ!
X

దిశ, సినిమా: మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటు మూవీస్ అని కాకుండా మంచు లక్ష్మీ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేబడుతుంటుంది. టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచు లక్ష్మీ గతేడాది యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో సుమారు 56 పాఠశాలలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఈ ఏడాది మరో 30 పాఠశాలలను ఆమె దత్తత తీసుకుని మరోసారి మంచి మనసు చాటుకున్నారు.

ఇందుకోసం గద్వేల్ జిల్లా కలెక్టర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపిన ఆమె.. అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మీ ‘ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవడం రావాలి. ఈ కార్యక్రమం ద్వారా మూడు స్థాయిలలో విద్యాబోధన ఉంటుంది. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్‌లో బోధన ఉంటుంది. అలాగే టీవీ, వాల్ పెయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి సమకూరుస్తాం’ అని చెప్పింది. ఇక 30 పాఠశాలల్లో ఈ వసతులు కల్పించనున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకం చేసింది మంచు లక్ష్మీ.

Advertisement

Next Story