షాకింగ్ పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మి.. ఏమైందంటూ ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2024-08-26 14:07:30.0  )
షాకింగ్ పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మి.. ఏమైందంటూ ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి, మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాలు చేసింది. అంతేకాకుండా నిర్మాతగా కూడా కొన్ని మూవీస్ తెరకెక్కించింది. కానీ గత కొద్ది రోజుల నుంచి మంచు లక్ష్మి ఇండస్ట్రీకి దూరం అయి కూతురితో అమెరికాలో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టిగ్‌గా ఉంటూ పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేసి ట్రోలింగ్‌కు గురవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, తనకు ఎలర్జీ అవడం వల్ల మూతి పగిలిన ఫొటో షేర్ చేసింది. ‘‘ నా ఫొటో చూశారుగా.. నేను ఇలా ఉన్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో దానిని చూసిన వారంతా ఆమె ఏమైంది అలా మారిపోయిందని షాక్ అయ్యారు. ఇక మంచు లక్ష్మి తనకు ఏమైందో తెలుపుతూ వరుస పోస్టులు పెట్టింది. ‘‘ మనం శరీరం ఏది తీసుకోగలదో అదే తీసుకోవాలి. ఏదైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తీసుకుంటే కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అయితే నా కూడా అలాగే రెండు టాబ్లెట్స్ వేసుకున్నందుకు వెంటనే ఇలా అయింది.

నా పెదవులు పగిలిపోయి మాట్లాడలేని విధంగా అయ్యాను. అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్ ఓ డాక్టర్ కావడంతో వెంటనే అలర్జీ కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ప్రజెంట్ నేను బాగానే ఉన్నాను. లేకపోతే దారుణంగా మారి పోయేదాన్ని. అయితే నాకు వచ్చిన అలర్జీని ఐసోలేటెడ్ డ్రగ్ అలర్జీ అంటారు. నాకు అరచేతి మీద కూడా వాపులా వచ్చింది. ఇప్పుడు పెదాలకు వచ్చింది తగ్గడంతో 10 రోజుల తర్వాత లిప్‌స్టిక్ పెట్టుకున్నా ’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story