- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జానర్ లో అడుగు పెడుతున్న మంచు లక్ష్మి..
దిశ, సినిమా: టాలీవుడ్ మంచు ఫ్యామిలీ నుంచి నటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది లక్ష్మీ ప్రసన్న. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె ముందు ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీలో విలన్‌గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో మంచి లక్ష్మి నటనకుగాను నంది అవార్డు కూడా వరించింది. దీం తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘దొంగాట’ తో సహా కొన్ని సినిమాల్లో మంచు లక్ష్మి లీడ్ రోల్స్ చేసింది కానీ.. ఏవీ సరైన హిట్ అందుకోలేదు. దీంతో కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకోక తప్పలేదు. కాగా ఇప్పుడు మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’ అనే మూవీతో రాబోతుంది. ఎర్రగుడి కథ అనేది ఈ సినిమా ఉప శీర్షిక. ఈ ట్యాగ్ లైన్‌కు తగ్గట్లే రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్‌తో రీసెంట్ గా పోస్టర్లు కూడా వదిలారు. ఇందులో మంచు లక్ష్మి భయానక అవతారంలో ఆకర్షణీయంగా ఉంది. సంజీవ్ మెగోటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా. ఎమ్మెస్కే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెటగాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, తదితరులు నటించాగా. ప్రొడక్షన్, టెక్నికల్ టీంలో అందరూ కూడా కొత్తవాళ్లే. అయితే ఇప్పటి వరకు తొంభైవ దశకంలో దేవత-గుడి ఇలాంటి కథలు చాలా వచ్చేవి. ప్రజంట్ ఇప్పుడు అంత కూడా ఆ ట్రెండునే ఫాలో అవుతూ మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఆ జానర్లోకే అడుగు పెడుతోంది. మరి ఈ సినిమాతో అయినా ఆమెకు మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.