తమ్ముడుకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. సంతోషంలో మనోజ్ (వీడియో)

by sudharani |   ( Updated:2024-09-11 15:13:51.0  )
తమ్ముడుకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. సంతోషంలో మనోజ్ (వీడియో)
X

దిశ, సినిమా: మంచు మనోజ్, భూమా మౌనిక ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిడ్డకు అన్న ప్రసన్న జరగడంతో దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. అలాగే.. మంచు లక్ష్మి బిడ్డ యాపిల్‌ను మనోజ్‌కు తెలియకుండా ఫంక్షన్‌కు తీసుకెళ్లి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి షేర్ చేస్తూ.. ‘ఇది చాలా అందమైన రోజు.. ఈ రోజు నా హృదయాన్ని ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయింది. నా స్వీట్ చిన్న మేనకోడలు అన్న ప్రసన్న మేము, మా కుటుంబం, స్నేహితులతో జరుపుకున్న క్షణం. హిందువులుగా మనం ఆచరించే ఈ సంప్రదాయాలలో నిజంగా ప్రత్యేకత ఉంది.

కొత్త ప్రారంభాలు, మైలురాళ్లను గుర్తించడం, జీవిత సౌందర్యాన్ని కలిసి జరుపుకోవడం ఇదోక ప్రత్యేక అనుభూతి. యాపిల్‌ను చూడగానే మనోజ్ రియాక్షన్ వెలకట్టలేనిది (ఆమెను తీసుకొచ్చి ఆశ్చర్యపరిచాను). మేము కుటుంబం, ప్రియమైన స్నేహితులతో పంచుకునే బంధం కంటే గొప్ప బంధం లేదు. ఇలాంటి మంచి వ్యక్తులను నా పక్కన కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. ఈ అందమైన రోజు కోసం.. మనల్ని దగ్గర చేసే విమానాలు, కార్లు అలాగే వర్షం ఉన్నప్పటికీ ఈ యాత్రను చాలా ఆహ్లాదకరంగా చేసినందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గణేశుడు నా చిన్న మేనకోడలు దేవసేనను ఎల్లప్పుడూ కాపాడుతాడు, ఆమెను అడుగడుగునా రక్షిస్తాడు. ప్రేమ, సంరక్షణ, వెచ్చదనంతో నిండిన ఇలాంటి క్షణాల కోసం జీవించే ఒక అత్తగా నా హృదయం నిండి ఉంది’ అంటూ పోస్ట్‌లో పెట్టింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed