విడిపోయిన మరో స్టార్ జంట.. క్లారిటీ ఇస్తూ హీరో పోస్ట్

by sudharani |
విడిపోయిన మరో స్టార్ జంట.. క్లారిటీ ఇస్తూ హీరో పోస్ట్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రటీలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అప్పటి వరకు కలిసి ఉంటూ సడెన్‌గా విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. ఇక ఇటీవల శృతిహాసన్ తన ప్రియుడుతో విడిపోయినట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జంట విడిపోయినట్లు తెలుస్తుంది. వాళ్లు మరెవరో కాదు.. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ బాలీవుడ్ జంట.. విడిపోయినట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

అయితే.. ఈ రూమర్స్ వారు స్పందించనప్పటికీ.. మ‌లైకా టీమ్ స్పందిస్తూ ‘బ్రేక‌ప్ వార్తలు రూమ‌ర్స్’ అంటూ కొట్టిపడేశారు. ఇక బ్రేకప్ రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడింది అనుకునే సమయంలో.. అర్జున్ కపూర్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ మేరకు ‘జీవితంలో మనకు రెండు అవకాశాలు ఉంటాయి. మనం మన గతానికి ఖైదీలు కావచ్చు లేదా.. భవిష్యత్తు అవకాశాలను అన్వేషించవచ్చు’ అంటూ ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి బ్రేకప్ రూమర్స్ ఊపందుకున్నాయి. వారిద్దరు విడిపోయినట్లు ఇన్‌డైరెక్ట్‌గా అర్జున్ కపూర్ తెలిపాడు అంటూ నెట్టింట రచ్చ స్టార్ట్ చేశారు.

Next Story