- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: ‘ఓజీ’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పవన్ కల్యాణ్ బ్యాక్ ఆన్ మిషన్ అంటూ స్పెషల్ స్టిల్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. దీంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరం అవతారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో.. Pawan Kalyanపవన్ తొందరలోనే మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటారని చెప్పారు. కానీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన మధ్యలో ఆపేసిన మూవీస్ పూర్తి చేసి విడుదల చేస్తారా అని నెట్టింట పలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో..తాజాగా, ఓజీ టీమ్ క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టారు. నిర్మాత డీవీవీ దానయ్య, పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ ముగ్గురు కలిసి తీసుకున్న ఫొటో షేర్ చేస్తూ..‘‘ ఓజీ అండ్ స్వ్కాడ్ టీం బ్యాక్ ఆన్ మిషన్’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తొందరలోనే షూటింగ్ జాయిన్ అవ్వబోతున్నట్లు ఫొటోతో క్లారిటీ ఇచ్చినట్లు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముందుగా ఓజీ విడుదల అయ్యి ఇండస్ట్రీని షేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఓజీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అలాగే ఈ మధ్య విడుదలైన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించేశాయి.