- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ సిరీస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: మైత్రేయి

X
దిశ, సినిమా: ప్రముఖ కెనెడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్.. ‘నెవర్ హావ్ ఐ ఎవర్’ సిరీస్ తన జీవితాన్ని తలకిందులు చేసిందని చెప్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన ఈ సిరీస్ చివరి సీజన్ జూన్ 8న ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా దానితో తనకున్న అనుంబంధం గురించి తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన బ్యూటీ.. ‘ఎంతోమంది స్నేహితులను ఇచ్చిన, ఈ విజయవంతమైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ నా లైఫ్‌ను ఊహించని విధంగా మార్చేసింది. వ్యక్తిగతంగా నాపై చాలా ప్రభావం చూపింది. ఇందులో నా ప్రదర్శన అనుకున్నదానికంటే నన్ను మరింత గొప్ప మార్గాల్లో తీసుకెళ్లింది. మొత్తానికి నా జీవితం ఇలా తలకిందులుగా మారిపోతుందని, విజయవంతంగా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు’ అంటూ సంబరపడిపోయింది.
Next Story