Mahesh Babu: సినిమాల్లోకి మహేశ్ బాబు కొడుకు ఎంట్రీ.. ఆ మూవీ సీక్వెల్‌లో గౌతమ్‌?

by sudharani |   ( Updated:2024-08-13 08:48:25.0  )
Mahesh Babu: సినిమాల్లోకి మహేశ్ బాబు కొడుకు ఎంట్రీ.. ఆ మూవీ సీక్వెల్‌లో గౌతమ్‌?
X

దిశ, సినిమా: ఆగస్టు 9న ప్రిన్స్‌ మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా మురారి చిత్రం రీరిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. రీరిలీజ్‌ ట్రెండ్‌లో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన ఈ సినిమా విషయంలో అభిమానులు చేసిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు. ఈ చిత్రం రీ రిలీజ్‌ సందర్భంగా థియేటర్స్‌లో కొంత మంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఈ విషయంపై మురారి చిత్ర దర్శకుడు కృష్ణవంశీ అభిమానులను ఇలాంటి పనులు చేయెద్దని కూడా వారించాడు. ఇక ఈ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిస్తున్నారు దర్శకుడు కృష్ణవంశీ.

ఈ క్రమంలోనే ''మహేష్‌బాబు కొడుకు గౌతమ్‌ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ రానున్న రెండు మూడు సంవత్సరాల్లో మురారి సీక్వెల్‌ను తెరకెక్కించండి అని ఓ అభిమాని అడగ్గా.. ఆ విషయాన్ని నేను మీరు చెప్పకూడదు. మహేష్‌బాబు, నమ్రత, గౌతమ్‌ నిర్ణయించాలి. కాబట్టి ఇటువంటి కీలక నిర్ణయాల్ని వాళ్లకు వదిలేద్దాం'' అని సమాధానమిచ్చారు కృష్ణవంశీ. కాగా మహేష్‌బాబు-కృష్ణవంశీ కలయికలో తెరకెక్కిన చిత్రం 'మురారి'. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ అన్ని వర్గాల ఆదరణతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read More..

MAHESH BABU: పబ్లిక్‌లో నాగార్జున కోడలు శోభిత పరువు తీసిన మహేష్ బాబు.. నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్

Advertisement

Next Story