Mahesh Babu: పోలీస్ ఫ్యాన్ కి సెల్ఫీ ఇచ్చిన మహేష్.. బాబు నువ్వు సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్

by Prasanna |
Mahesh Babu: పోలీస్ ఫ్యాన్ కి సెల్ఫీ ఇచ్చిన మహేష్.. బాబు నువ్వు సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్
X

దిశ, సినిమా: గుంటూరు కారం మూవీతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం మనకీ తెలిసిందే. ఈ మూవీ ఓకే చెప్పిన రోజు నుంచి మహేష్ బాబు మూడేళ్లు కాల్ షీట్స్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే సినిమాకు తగ్గుట్టుగా హెయిర్ స్టైల్ మొత్తం మార్చేశాడు. బాడీ లుక్ ను కూడా పూర్తిగా మార్చేసాడు. ఈ మధ్య ఎక్కడ కనిపించిన మహేష్ న్యూ లుక్ మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ లుక్ చూసి బాబు నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు వర్క్ మీద ఓ స్టూడియోకి వెళ్తుండగా అక్కడ ఫ్యాన్స్ సెల్ఫీల కోసం మీద మీదకు వచ్చేసారు మహేష్ బాబు మనసు ఎలాంటిదో మనకు తెలుసు కదా ఎవరి మీద అరవకుండా ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చాడు. అదే సమయంలో ఓ పోలీస్ కూడా అతని వద్దకి వచ్చి సెల్ఫీ ఇవ్వమని కోరగా అతనికి కూల్ సెల్ఫీ ఇచ్చాడు. అయితే, ఫోటో ఇచ్చే క్రమంలో మహేష్ బాబు తాజా లుక్ బాగా వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం

Advertisement

Next Story