Mahesh Babu: త్రివిక్రమ్ సినిమా కోసం ఘోరంగ కష్టపడుతున్న మహేశ్ బాబు!

by Hamsa |   ( Updated:2023-03-02 06:23:28.0  )
Mahesh Babu: త్రివిక్రమ్ సినిమా కోసం ఘోరంగ కష్టపడుతున్న మహేశ్ బాబు!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. మొదటినుంచి ఈ మూవీ‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే మహేష్ ఇప్పటివరకూ ఏ మూవీలో కూడా షర్ట్ విప్పి, తన బాడీని కెమెరా ముందు చూపించలేదు.

కానీ, అభిమానులకు మాత్రం తమ హీరోని సిక్స్ ప్యాక్‌లో ఎప్పుడు చూస్తామా అని ఆతృతతో ఉన్నారు. ఇక ఆ కోరిక త్వరలో తీరబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో మహేష్ బాబు రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రెండింటిలో స్లీవ్‌లెస్ టీ షర్ట్‌లో కండలు చూపిస్తూ కనిపించారు. మరి ఆ లుక్ త్రివిక్రమ్ మూవీ కోసమా? లేక జక్కన్న సినిమా కోసమా? అనేది తెలియాల్సివుంది.

Advertisement

Next Story