MAHESH BABU - NIHARIKA : మెగా డాటర్ నిహారిక సినిమాపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-12 05:19:04.0  )
MAHESH BABU - NIHARIKA : మెగా డాటర్ నిహారిక సినిమాపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక కొణిదెల మెయిన్ స్ట్రీమ్ మూవీని తొలిసారి నిర్మించింది. 'కమిటీ కుర్రోళ్ళు' అంటూ పూర్తిగా యంగ్ టీంతోనే వచ్చేసింది. ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మూవీ చూసిన సెలబ్రిటీలు కూడా అదిరిపోయే రివ్యూ ఇస్తున్నారు. ఈ చిత్రం తమను చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిందని చెప్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ యంగ్ టీం గురించే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అప్రిసియేషన్ ట్వీట్ చేశాడు.

' 'కమిటీ కుర్రోళ్ళు' గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా. నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్ పై కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీంకు కూడా శుభాకాంక్షలు. త్వరలో సినిమా చూస్తాను ' అంటూ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన మహేష్ బాబు అభిమానులు... ' అన్న రెస్పాండ్ అయ్యాడంటే మనం కూడా మూవీ చూడాల్సిందే. నీహారికకు మహేష్ బాబు ఫాన్స్ సపోర్ట్ వచ్చేస్తోంది ' అంటున్నారు. ప్రిన్స్ అసలైన మూవీ లవర్ అని మరోసారి నిరూపించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story