మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఒకేసారి రెండు అప్డేట్స్!

by Hamsa |
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఒకేసారి రెండు అప్డేట్స్!
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘SSMB28’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం నుంచి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తాజాగా, చిత్ర యూనిట్ ‘SSMB 28’ డబుల్ ధమాకా అప్డేట్ ఇస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘ హే సూపర్ ఫ్యాన్స్, మేము కూడా #SSMB28 కోసం మీ నిరీక్షణ & ఉత్సాహాన్ని పంచుకుంటాము. సూపర్‌స్టార్ మాస్ విందు కోసం మీరు ఎదురుచూస్తున్నారు. అది మాకు చాలా విలువైనది, మేము హామీ ఇస్తున్నాము. సరైన సమయంలో ప్రకటిస్తాము చూస్తూ ఉండండి’’ అంటూ విల్లు ఎక్కుపెట్టిన, విల్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు. దీంతో ఈ సినిమా మార్చి 29న శ్రీరామ నవమికి అప్డేట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అది చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story