ఆ స్టార్ డైరెక్టర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. !

by Kavitha |   ( Updated:2024-02-22 09:56:31.0  )
ఆ స్టార్ డైరెక్టర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. !
X

దిశ, సినిమా: మహేష్ బాబు రేంజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ మహేష్ తో సినిమా చేయడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఆచితూచి ముందుకు కదులుతున్నారు. అయితే తాజాగా మహేష్ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటీ అంటే తమిళ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలని ప్రయత్నించాడంటా. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంతకీ ఏంటా సినిమా అంటే బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన ‘త్రీ ఇడియట్స్ ‘ సినిమాని శంకర్, మహేష్ బాబు తో రీమేక్ చేయాలని చూశాడు. కానీ మహేష్ బాబు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు.

దీంతో శంకర్ విజయ్ ని హీరోగా పెట్టి తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లో ‘స్నేహితుడు ‘ టైటిల్ తో తీశాడు. ఇక ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయినప్పటికి తమిళ్ లో యావరేజ్ గా ఆడింది. ఇక ఇది తెలుసుకున్న మహేష్ అభిమానులు అప్పట్లో ఈ మూవీ ఒప్పుకోకుండా మంచి పని చేశారు అని సంతోషం వ్యక్తం చేశారు. దీం తర్వాత మహేష్ బాబుతో ఏకంగా తెలుగు సినిమా చేయాలని శంకర్ అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా మహేష్ శంకర్ కి అవకాశం ఇవ్వలేదు. మరి దీని బట్టి చూసుకుంటే స్టార్ దర్శకుల్లో ఒకరైనా శంకర్ మీద మహేష్ బాబు కి మంచి ఒపీనియన్ లేనట్లు తెలుస్తోంది.

Read More..

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇకపై మహేష్ బాబుని చూడలేరు

Advertisement

Next Story