- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీతో క్రేజీ టూర్ ప్లాన్ చేసిన మహేశ్ బాబు.. ఎక్కడికో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ దేవర మూవీ కోసం బ్రేక్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో క్రిస్మస్ టూర్ ప్లాన్ చేశారట. దాదాపు వారం రోజుల పాటు ఈ వెకేషన్‌లో ఎంజాయ్ చేయనున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
క్రిస్మస్ ఫెస్టివల్ వరకు సూపర్ స్టార్ నటిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని వెకేషన్ తర్వాత ప్రమోషన్లలో బిజీ కానున్నారని సమాచారం. మహేష్ బాబు, చరణ్, తారక్.. ముగ్గురు కలిసి క్రిస్మస్ వెకేషన్ ప్లాన్ చేశారని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ మూడు కుటుంబాలు కలిసి ఎక్కడికి వెకేషన్ ప్లాన్ చేశారో తెలుసా? మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైనటువంటి పారిస్ వెళ్లబోతున్నట్లు టాక్. ఇక ఈ ముగ్గురు అగ్ర హీరోల ఫ్యామిలీ కనుక ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే క్రిస్మస్ ఫేస్ట్ వరకు ఎదురుచూడాల్సిందే.