Mahesh Babu : దుబాయ్‌లో ల‌గ్జరీ విల్లా కొన్న మ‌హేష్ బాబు?

by Prasanna |   ( Updated:2023-05-02 15:20:27.0  )
Mahesh Babu : దుబాయ్‌లో ల‌గ్జరీ విల్లా కొన్న మ‌హేష్ బాబు?
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు సినిమాలతో పాటు పలు వ్యాపారాల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు కూడా ఒకరు. హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే, నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే అనేక టాప్‌ బ్రాండ్స్‌కు ప్రచార‌క‌ర్తగా వ్యహ‌రిస్తున్నాడు. మ‌రోవైపు రెస్టారెంట్, మల్టీప్లెక్స్ వ్యాపార‌ల్లోకి అడుగు పెట్టి భారీగా సంపాదిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ దుబాయ్‌లో ఓ ల‌గ్జరీ విల్లాను కొనుగోలు చేశాడట. దీని ఖరీదు కోట్లలో ఉండగా మహేష్, తన కుమారుడు గౌతమ్‌తో కలిసి ఈ విల్లా రిజిస్ట్రేషన్ పనిమీద దుబాయ్ వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Next Story