ఆయన కారణంగానే ఇదంతా జరిగింది.. ‘గుంటూరు కారం’ ఈవెంట్‌లో మహేష్ బాబు

by sudharani |   ( Updated:2024-01-09 15:51:39.0  )
ఆయన కారణంగానే ఇదంతా జరిగింది.. ‘గుంటూరు కారం’ ఈవెంట్‌లో మహేష్ బాబు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ.. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మూవీ టీం. ఈ క్రమంలోనే నేడు గ్రాండ్‌గా గుంటూరులో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌న్ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘గుంటూరులో మొదటి ఫంక్షన్ జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా త్రివిక్రమ్ వల్లే జరిగింది. ఆయనే గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని అన్నారు. దానికి మేము అందరూ ఒకే అనేశాము. త్రివిక్రమ్ అంటే నాకు ఓ ఫ్రెండ్ కన్నా ఎక్కువ. ఆయన అంటే చాలా ఇష్టం. గత రెండేళ్లలో ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను. త్రివిక్రమ్‌తో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story